![]() |
![]() |
.webp)
శ్రష్టి వర్మ ఇప్పుడు టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న లేడీ కొరియోగ్రాఫర్. పుష్ప 2 మూవీలో జాతర సీన్ లో వచ్చే సాంగ్ అంటే అందరికీ ఇష్టమే. అదే "సూసెకి అగ్గిరవ్వ మాదిరి" అనే సాంగ్.. ఇది ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ కి అల్లు అర్జున్, రష్మిక అద్భుతంగా డాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద రీల్స్ చేయని వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ సాంగ్ ని గణేష్ మాష్టర్ కంపోజ్ చేస్తే శ్రష్టి వర్మ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ కి చేసిన స్టెప్స్ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈమె ఢీ షో నుంచి బయటకు వచ్చాక జానీ మాష్టర్ తో కలిసి కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది.

ఆ తర్వాత జానీ మాష్టర్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది శ్రష్టి వర్మ. ఏదేమైనా ఇప్పుడు జానీ మాష్టర్ కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చి ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అలాగే శ్రష్టి వర్మ కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. ఇక ఇప్పుడు శ్రష్టి వర్మ హ్యుందాయ్ ఫార్ట్యూనర్ కార్ ని కొనుగోలు చేసింది. అది టాప్ ఓపెన్ చేసి బయటకు చూస్తూ పిక్స్ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. అలాగే మాతా రాణి కృప వలన కార్ కొనుక్కున్నంటూ పోస్ట్ పెట్టుకుంది. నెటిజన్స్ ఆమెకు విషెస్ చెప్తున్నారు. ఆమె తన డెబ్యూ మూవీ శర్వానంద్ నటించిన మనమే అనే చిత్రంలో "నా మాట " అనే సాంగ్ కి కోరియోగ్రఫీ చేసింది. ఇక శ్రష్టి వర్మ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు చేయడంతో ఆయన తన నేషనల్ అవార్డుని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనా శ్రష్టి ఇప్పుడు మూవీస్ కి కొరియోగ్రాఫ్ చేస్తూ ఎదుగుతోంది.
![]() |
![]() |